Uday Srinivas: కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌కు సైబర్ షాక్.. వాట్సాప్ డీపీతో రూ. 92 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

Uday Srinivas: కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌కు సైబర్ షాక్.. వాట్సాప్ డీపీతో రూ. 92 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
x

Uday Srinivas: కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌కు సైబర్ షాక్.. వాట్సాప్ డీపీతో రూ. 92 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

Highlights

Uday Srinivas: కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌కి సైబర్ షాక్ తగిలింది.

Uday Srinivas: కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌కి సైబర్ షాక్ తగిలింది. కాకినాడ ఎంపీ, టీ-టైం సంస్థ అధినేత ఉదయ్ శ్రీనివాస్ పేరును అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి తెరలేపారు. ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ చిత్రంగా పెట్టి, ఆయన సంస్థకే చెందిన ఫైనాన్స్ మేనేజర్‌ను నమ్మించి ఏకంగా 92 లక్షల రూపాయలు కాజేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

టీ-టైం సంస్థలో చీఫ్ ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న గంగిశెట్టి శ్రీనివాసరావుకు గత నెల 22న ఓ నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వ‌చ్చింది. ఆ నంబర్ ప్రొఫైల్ ఫొటోగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చిత్రం ఉండటంతో అది ఆయనేనని శ్రీనివాసరావు భావించారు. తాను కొత్త నంబర్ వినియోగిస్తున్నాడని... అత్యవసరంగా కొంత డబ్బు పంపాలని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపారు. తన యజమానే అడుగుతున్నారని పూర్తిగా విశ్వసించిన మేనేజర్.... ఎటువంటి క్రాస్ చెక్ చేసుకోకుండా నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాలకు 11 విడతల్లో 92 లక్షలు బదిలీ చేశారు.

ఈ నెల 8న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన కంపెనీ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేస్తుండగా కొన్ని అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. వెంటనే ఫైనాన్స్ మేనేజర్‌ను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తాను డబ్బుల కోసం ఎలాంటి సందేశాలు పంపలేదని... తన ఫోన్ నంబర్ కూడా మారలేదని ఎంపీ స్పష్టం చేయడంతో మేనేజర్ నివ్వెరపోయారు. తాను మోసపోయామని గ్రహించిన వెంటనే వారు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, నగదు బదిలీ జరిగిన రెండు వారాల తర్వాత ఫిర్యాదు అందడంతో అప్పటికే నేరగాళ్లు ఎక్కువ మొత్తాన్ని డ్రా చేశారు. పోలీసులు తక్షణమే స్పందించినా కేవలం 7 లక్షల రూపాయలను మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు.


Show Full Article
Print Article
Next Story
More Stories