నెల్లూరు జిల్లా వైసీపీలో అంతర్గత పోరు.. మంత్రి కాకాణి వర్సెస్ అనిల్‌కుమార్...

Nellore: నేడు పోటాపోటీగా మంత్రి కాకాణి, మాజీమంత్రి అనిల్ కార్యక్రమాలు...

Shireesha
Published on: 17 April 2022 11:36 AM IST
Kakani Govardhan Reddy vs Anil Kumar Yadav in Nellore District | AP Live News
X

నెల్లూరు జిల్లా వైసీపీలో అంతర్గత పోరు.. మంత్రి కాకాణి వర్సెస్ అనిల్‌కుమార్...

Nellore: నెల్లూరు జిల్లా వైసీపీలో అంతర్గత పోరు రచ్చకెక్కింది. మంత్రి కాకాణి, అనిల్‌కుమార్ మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. నేడు పోటాపోటీగా మంత్రి కాకాణి, మాజీమంత్రి అనిల్ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. మంత్రి హోదాలో ఇవాళ తొలిసారి నెల్లూరుకు రానున్నారు కాకాణి. సాయంత్రం 4 గంటలకు రోడ్డు మార్గాన భారీ ప్రదర్శనతో నగరానికి చేరుకోనున్నారు కాకాణి గోవర్ధన్‌రెడ్డి. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం అదే సమయానికి మాజీ మంత్రి, అనిల్ అనిల్‌ కూడా సభకు ప్లాన్ చేశారు.

నగరంలో పలు చోట్ల కాకాణి ఫ్లెక్సీలు, బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. పోటాపోటీ కార్యక్రమాలతో నెల్లూరు రాజకీయం రసవత్తరంగా మారింది. నెల్లూరు వైసీపీ రాజకీయాలపై అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇరువురి నేతలతో పార్టీ పెద్దలు మాట్లాడినట్లు సమాచారం. ఎవరి కార్యక్రమాలు వారు చేసుకోవాలని.. విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story