బారాషాహిద్ దర్గాను దర్శించుకున్న మంత్రి కాకాణి

Kakani Govardhan Reddy: జగన్ మరోసారి సీఎం కావాలని కోరుకున్నా

Shekhar G
Published on: 31 July 2023 5:46 PM IST
Kakani Govardhan Reddy Visited Bara Shaheed Dargah
X

బారాషాహిద్ దర్గాను దర్శించుకున్న మంత్రి కాకాణి

Kakani Govardhan Reddy: నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగకు భక్తులు పోటెత్తారు. గంధోత్సవం ముగియడంతో బారాషాహిద్‌లను దర్శించునేందుకు విఐపీలు క్యూ కడుతున్నారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్సీలు, ప్రముఖులు, కార్పొరేటర్లు బారాషాహిద్ లను దర్శించుకున్నారు. స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకున్నారు. రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావాలంటూ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరస్పరం రొట్టెలను మార్పిడి చేసుకున్నారు. జగన్ మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని అల్లాను కోరుకున్నట్లు మంత్రి కాకాణి వెల్లడించారు.

Shekhar G

Shekhar G

Next Story