అసెంబ్లీ సమావేశాలలో తన గళం విప్పిన కాకాణి గోవర్ధన్ రెడ్డి

అసెంబ్లీ సమావేశాలలో తన గళం విప్పిన కాకాణి గోవర్ధన్ రెడ్డి
x
శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి (Image Source: I&PRAP)
Highlights

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభా హక్కుల కమిటీ ఛైర్మన్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలలో 2 వ రోజున తన గళం విప్పారు.

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ శాసన సభా హక్కుల కమిటీ ఛైర్మన్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలలో 2 వ రోజున తన గళం విప్పారు. చంద్రబాబు నాయుడు నిర్వాకంపై నిప్పులు చెరిగారు. చాలా రోజుల తరువాత రైతుల కుటుంబాలలో సంతోషం వ్యక్తం అవుతుంది. గతంలో రైతులు కరవు బారిన పడటం, రైతులు తీవ్ర ఇబ్బందులు పడటం గత 5 సంవత్సరాలు చూశామన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా చంద్రబాబు, కరువు కవల పిల్లలలా తయారు అయ్యారు. రైతు రుణమాఫీ అన్నారు. పత్రాలు అన్నారు మోసం చేశారు. చంద్రబాబు పాలన ఒక చీకటి అధ్యాయంలాగా మిగిలిపోయింది. పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళకి లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఎక్కడా అభివృద్ధి లేదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనడం సిగ్గుచేటు.

జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. కానీ చంద్రబాబు పాదయాత్రలో మాత్రం బస్సులో సేద తీరి కనీసం రైతుల సమస్యలు పట్టించుకున్న పరిస్థితి లేదు. బేషరతుగా రుణమాఫీ అన్నారు, తరువాత మాట మార్చారు. అదే జగన్మోహన్ రెడ్డి రైతులకు చెప్పిన దాని కన్నా మిన్నగా, ముందుగా ఇస్తున్నారు. గతంలో చంద్రబాబు మోసం చేస్తే, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చెప్పిన దానికన్నా మిన్నగా ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేస్తుండడంతో, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా గర్వపడుతున్నాను. ఆరు నెలల్లోనే తిరిగి స్వర్ణయుగం తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. రైతులకు అన్నివిధాలా చేయూత ఇస్తున్నారు.

రైతులకు చెప్పిన విధంగా రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నారు. చంద్రబాబు గతంలో ఆక్వా రైతులకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి కోరిన వెంటనే హామీ ఇచ్చారు. గతంలో జన్మభూమి కమీటీలతో దుర్మార్గపు పాలన చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క పార్టీకి కాకుండా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉంటూ అందరికి అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారు.

ఇంగ్లీష్ పై రాద్దాంతం చేస్తున్న చంద్రబాబుకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటే రాష్ట్ర పరువు పోకుండా ఉండేది. చంద్రబాబు సమావేశాలకు వచ్చిన వారు వెళ్లిపోతుంటే పోలీసులను పెట్టి అడ్డగించిన పరిస్థితి. సమాజానికి అన్నం పెట్టె రైతులను "దేహీ"అనే పరిస్థితి కి చంద్రబాబు తీసుకొచ్చారు. కానీ రైతులను రారాజుగా జగన్మోహన్ రెడ్డి చేశారు.రైతుభరోసా అమలు చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు, ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని రైతులు కోరుకుంటున్నారు.ఇంక తెలుగుదేశంకు పుట్టగతులు ఉండవనిఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి నిండు సభలో స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories