Top
logo

నో బ్యాగ్ డే అమలు చేయాలి: డీఈఓ

నో బ్యాగ్ డే అమలు చేయాలి: డీఈఓ
Highlights

కడప: పాఠశాల విద్యా సంచాలకుల ఉత్తర్వుల మేరకు ప్రతి నెలా మొదటి, మూడో శనివారాలలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో...

కడప: పాఠశాల విద్యా సంచాలకుల ఉత్తర్వుల మేరకు ప్రతి నెలా మొదటి, మూడో శనివారాలలో అన్ని యాజమాన్య పాఠశాలల్లో విద్యార్థులకు 1నుండి 5 వ తరగతి వరకు నో బ్యాగ్ డే అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలా అమలు చేయని పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు నెలలోని మొదటి, మూడో శనివారాలలో తప్పనిసరిగా ప్రైవేటు పాఠశాలను సందర్శించి నోబ్యాగ్ డే అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

Next Story