Top
logo

దస్తావేజుల తయారీపై అవగాహన సదస్సు

దస్తావేజుల తయారీపై అవగాహన సదస్సు
Highlights

ఆస్తి క్రయ,విక్రయదారులు తమ దస్తావేజులను ఇంటర్ నెట్ లో స్వయంగా తయారు చేసుకునే విధానం పై కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని సభా భవనంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు.

కడప: ఆస్తి క్రయ,విక్రయదారులు తమ దస్తావేజులను ఇంటర్ నెట్ లో స్వయంగా తయారు చేసుకునే విధానం పై కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని సభా భవనంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలనుండి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు డిఐజి ఉదయ భాస్కర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి సాధారణ ప్రజలు, న్యాయవాదులు, స్థిరాస్తి వ్యాపారులు, బ్యాంకు అధికారులు, గణాంక నిపుణులు తదితరులకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు ప్రజలను కోరారు.

Next Story