నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన

CM Jagan Tour: రేపు ఇడుపులపాయలో వైఎస్సార్ వర్ధంతి వేడుకలు

Jyothi
Updated on: 1 Sept 2022 6:44 AM IST
Kadapa District CM Jagan Visit for Three Days From Today
X

నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన

CM Jagan Tour: ఏపీ సీఎం జగన్ ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రేపు వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు. ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం జగన్ బయలుదేరుతారు. 3గంటల 30 నిమిషాలకు వేముల మండలం వేల్పుల గ్రామానికి చేరుకుని గ్రామ సచివాలయం కాంప్లెక్స్‌ను జగన్ ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు అక్కడి నుంచి 5గంటల 35 నిమిషాలకు ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ ఎస్టేట్‌లో రాత్రి బస చేయనున్నారు.

రేపు ఉదయం 8 గంటల 50 నిమిషాలకు ఇడుపులపాయల నుంచి బయలుదేరి 9 గంటల నుంచి 9 గంటల 40 నిమిషాల వరకు ఎస్టేట్‌లోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొంటారు. 9గంటల 45 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి ఎస్టేట్‌లోని ప్రేయర్ హాల్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై జగన్ సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం వరకు సమీక్షా సమావేశాల అనంతరం ఎస్టేట్‌లోని వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేస్తారు. సెప్టెంబర్ 3న ఉదయం 8గంటల 50 నిమిషాలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 10 గంటల 40 నిమిషాలకు తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకుంటారు.

Jyothi

Jyothi

Next Story