Kadapa Bomb Blast: కడప జిల్లా కలసపాడు మండలంలో పేలుడు

Kadapa Bomb Blast: మామిళ్లపల్లె దగ్గర ముగ్గురాయి బ్లాస్టింగ్ చేస్తుండగా పేలుడు

Sandeep Eggoju
Published on: 8 May 2021 11:53 AM IST
Kadapa Bomb Blast in Kadapa District Kalasapadu Mandal
X

కడప జిల్లలో బాంబు పేలుడు (ఫైల్ ఇమేజ్)

Kadapa Bomb Blast: క‌డ‌ప జిల్లాలో క‌ల‌కలం చెల‌రేగింది. భారీ పేలుడు సంభ‌వించి పది మంది అక్కడిక‌క్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి మృత‌దేహాలు తునాతున‌క‌లయ్యాయి. ఈ ఘ‌ట‌న‌లో మ‌రికొంత మందికి గాయాల‌య్యాయి. వారి ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏడు మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం.

క‌డ‌ప జిల్లా క‌ల‌స‌పాడు మండ‌లం మామిళ్లప‌ల్లె శివారులో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జిలెటిన్‌స్టిక్స్ ను వాహ‌నంలో తీసుకొస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని తెలిసింది. ప్రమాద‌వ‌శాత్తు వాహ‌నంలో జిలెటిన్‌స్టిక్స్ పేలాయి. బ‌ద్వేలు నుంచి ముగ్గురాళ్లగ‌నికి జిలెటిన్‌స్టిక్స్ త‌ర‌లిస్తుండ‌గా ఘ‌ట‌న చోటు చేసుకుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story