KA Paul: అవినాష్ రెడ్డి తల్లిని పరామర్శించిన కేఏ పాల్

KA Paul: శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న కేఏపాల్

Jyothi
Updated on: 25 May 2023 8:10 PM IST
KA Paul Visits MP YS Avinash Reddy Mother
X

KA Paul: అవినాష్ రెడ్డి తల్లిని పరామర్శించిన కేఏపాల్

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మిని ఆయన పరామర్శించారు. లక్ష్మీ ఆరోగ్య పరిస్థితులను డాక్టర్లను కేఏపాల్ అడిగి తెలుసుకున్నారు. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం వెంటనే కోలుకునెలా భగవంతున్ని ప్రార్థించాలని కోరారు. గతంలో తాను నిర్వహించిన శాంతి సభలో అవినాష్ రెడ్డి తల్లి శ్రీ లక్ష్మి తో పాటు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సోదరి విమలమ్మ పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

తాను ఎన్నికల ప్రచారం కోసం టర్కీ వెళ్లాల్సి ఉన్నా.. మీడియాలో వైయస్ వివేకానంద రెడ్డి సోదరి విమలమ్మ ఇంటర్వ్యూ చూసి అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని పరామర్శించేందుకు విశ్వ భారతి ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపారు. ఇక అవినాశ్, సీబీఐ కేసు విషయంపైనా కేఏపాల్ స్పందించారు. ఈ కేసు నుండి అవినాష్ నిరపరాధిగా బయట పడతారన్నారాయన.

Jyothi

Jyothi

Next Story