Andhra Pradesh: ఏపీ ప్రభుత్వంపై కెఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వంపై కెఏ పాల్ మండిపడ్డారు.

Arun Chilukuri
Updated on: 28 April 2021 5:35 PM IST
KA Paul
X

కే.ఏ పాల్ ఫైల్ ఫోటో 

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వంపై కెఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వివేకంతో ఆలోచించడం లేదని విమర్శించారు. కరోనా విజృంభిస్తున్న వేళ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం అనడం అవివేకం అన్నారు. కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో సరీక్షలు వాయిదా వేసిన వేళ పరీక్షలు నిర్వహించడం మంచిది కాదని హితవు పలికారు. ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని తరగతుల పరీక్షలను వాయిదా వేసింది. అయితే టెన్త్, ఇంటర్ పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా రగడ కొనసాగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story