Ongole: నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు

Ongole: అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే అంటూ క్యాప్షన్

Jyothi
Updated on: 18 July 2023 9:15 AM IST
Jr NTR Flexis In Prakasam District
X

Ongole: నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు

Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్.. 'అసలోడు వచ్చే వరకూ కొసరోడికి పండగే' అంటూ ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓవైపు లోకేష్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సమయంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. ఎవరిని ఉద్దేశించి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనే చర్చ జరుగుతోంది.. వీటిని ఎవరు ఏర్పాటు చేశారో టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు.

మరోవైపు యువగళం పాద‌యాత్ర 157వ రోజు కొండేపి నియోజకవర్గంలో కొనసాగింది. మాలెపాడు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. మాలెపాడులో పాడిరైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు లోకేష్.

Jyothi

Jyothi

Next Story