NTR: చంద్ర‌బాబు ఇలాకలో ఎన్టీఆర్ జపం..రాజకీయాల్లోకి రావాలంటూ జెండా

NTR Flag in Kuppam: తెలుగు దేశం పార్టీ భ‌విష్య‌త్ ఆశాకిర‌ణంగా జూ. ఎన్టీఆర్ అని ఆయ‌న అభిమానులు భావిస్తున్నారు.

Samba Siva Rao
Published on: 6 Jun 2021 5:07 PM IST
NTR Flag In Kuppam
X

NTR Flag

NTR Flag in Kuppam: తెలుగు దేశం పార్టీ భ‌విష్య‌త్ ఆశాకిర‌ణం జూ. ఎన్టీఆర్ అని ఆయ‌న అభిమానులు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జూ.ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో క్రీయాశీల‌క పాత్ర పోషించాల‌ని ఆయ‌న అభిమాన‌లు, టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏపీ త‌ర‌చూ ఎక్క‌డో ఒక చోట ఎన్టీఆర్ అభిమానులు ఆయ‌న జెండాలు, ఫెక్సీలు ఏర్పాటు చేసి రాజ‌కీయాల్లోకి రావాల‌ని కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పంలో ఎన్టీఆర్ కు అనుకులంగా జెండాలు, ఫెక్సీలు వెలిశాయి.

జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని జనవరి చంద్రబాబు పర్యటించనప్పుడు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ నూతన జెండా తయారు చేసి ఆవిష్కరించారు. కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కాగా జూనియర్ ఎన్టీఆర్ మాస్ హీరో. అంతేకాదు రాజకీయ పార్టీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. తాత ఎన్టీఆర్ పోలికలతో ఉండటం విశేషం. ఎంతటివారినైనా మాటలతో ఆకట్టుకునే తత్వం ఉన్నవాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలకంగా చూడాలని అభిమానులు భావిస్తున్నారు. గతంలోనూ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story