గ్రేటర్‌ ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

గ్రేటర్‌ ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
x
Highlights

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటుకోవాలని బీజేపీ భావిస్తోంది. గ్రేటర్‌ పోటీలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు అన్నివిధాలా ప్రయత్నాలు...

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటుకోవాలని బీజేపీ భావిస్తోంది. గ్రేటర్‌ పోటీలో అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా గ్రేటర్‌లో ప్రచారం చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను దింపింది. ఈ నెల 26న ఎల్బీనగర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభకు ప్లాన్‌ చేస్తున్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.

ఈ సభలో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు కూడా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. వారందరినీ జేపీ నడ్డా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే తొలిదశలో బీజేపీ యువ ఎంపీ తేజస్వి యాదవ్ హైదరాబాద్‌కు వచ్చి ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత పెద్దలు రానున్నారు. ఎన్నికల ప్రచారానికి కేవలం నవంబర్ 29 వరకే గడువు ఉంది. అంటే కేవలం ఇంకా 5 రోజులే ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ పెద్దలు వరుసగా హైదరాబాద్‌కు క్యూ కట్టనున్నారు. అందరు నేతలు ఒకే రోజు కాకుండా, రోజుకో నేత ప్రచారానికి రానున్నట్టు తెలిసింది. చివరి ఘట్టంలో అమిత్ షా ప్రచారానికి రానున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories