Jogi Ramesh: సీఎం జగన్ దావోస్ వెళ్తే టీడీపీ నాయకులకు కడుపు మంట ఎందుకు?

Jogi Ramesh: దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు సీఎం జగన్ వెళ్తే టీడీపీ నాయకులు ఏడుస్తున్నారని మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Updated on: 22 May 2022 7:00 PM IST
Jogi Ramesh Slams Chandrababu
X

Jogi Ramesh: సీఎం జగన్ దావోస్ వెళ్తే టీడీపీ నాయకులకు కడుపు మంట ఎందుకు?

Jogi Ramesh: దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు సీఎం జగన్ వెళ్తే టీడీపీ నాయకులు ఏడుస్తున్నారని మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 38సార్లు దావోస్‌కు వెళ్లినపుడు తోడుగా ఎవరిని తీసుకెళ్లారో గుర్తుచేసుకోవాలన్నారు. గతంలో చంద్రబాబు తన వెంట దోపిడీ దొంగలను తీసుకుని వెళ్లారని దోచుకున్న సొమ్మును దాచుకోవటానికి 38 సార్లు తీసుకెళ్లారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు దావోస్ వెళ్లి బుల్లెట్ రైలు పక్కన నిలబడి ఫొటోలు తీసుకున్నారన్నారు. ప్రభుత్వం దావోస్‌లో కొన్ని ఒప్పందాలు చేసుకుందని ఇదంతా చూసి తట్టుకోలేక అనవసరంగా ఊగిపోతున్నారని మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story