Krishna District: జోగి రమేష్ వద్దంటూ ఫ్లెక్సీలు..

Krishna District: ప్రధాన కూడళ్లలో వెలసిని ఫ్లెక్సీలు తొలగించిన మున్సిపల్ సిబ్బంది

Shekhar G
Published on: 15 Jan 2024 3:19 PM IST
Jogi Ramesh As The In-Charge Of Penamaluru Is Flexi
X

Krishna District: జోగి రమేష్ వద్దంటూ ఫ్లెక్సీలు..

Krishna District: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఫ్లెక్సీల ఏర్పాటు తీవ్ర చర్చకు దారి తీసింది. పెనమలూరు ఇన్‌ఛార్జ్‌గా జోగి రమేష్ తమకు వద్ద అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. పెనమలూరు ఇన్‌ఛార్జ్‌గా జోగి రమేష్‌ను నియమించడం సరైన నిర్ణయం కాదంటూ ఆ ఫ్లెక్సీలో తెలిపారు. నియోజకవర్గంలో ఎలాంటి పరిచయాలు లేని వ్యక్తిని ఇన్‌ఛార్జ్‌గా నియమించడంపై అధిష్టానం పునరాలోచించాలంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. మొదటి నుంచి వైసీపీ కోసం కష్టపడిన పడమటి సురేష్‌బాబుకు టికెట్ కేటాయించాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని కొన్ని ప్రధాన కూడళ్లలో జోగి రమేష్ వద్దు.. స్థానికులకే టికెట్ కేటాయించాలనే డిమాండ్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. మరో వైపు ఫ్లెక్సీల తొలగింపు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Shekhar G

Shekhar G

Next Story