Heavy Rains: అనంతపురం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
*జీడిపల్లి రిజర్వాయర్‌కు గండి పడే అవకాశం *భయాందోళనలో జీడిపల్లి వాసులు
జీడిపల్లి రిజర్వాయర్‌కు గండి పడే అవకాశం(ఫైల్ ఫోటో)
Heavy Rains: అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్‌కు భారీ వర్షాలతో గండి పడే ప్రమాదం ఉందని ఆందోళనలో రాత్రంతా గ్రామస్తులు జాగారణ చేశారు. వర్షంలో తడుస్తూ టార్చిలైట్లు వేసుకొని డ్యామ్ గట్టుపై తిరిగారు. ఒకటి, రెండు చోట్ల లీకేజీ వాటర్ బయటికి వస్తూ ఉండటంతో ఆందోళనకు గురయ్యారు.
కొందరు మహిళలు, గ్రామస్తులను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే లీకేజీ వాటర్ గ్రామంలోకి వస్తుండడం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
టార్చిలైట్ల సాయంతో రిజర్వాయర్ గట్టుపై గండిపడే అవకాశమున్న ప్రదేశాలలో వెతికారు. గ్రామంలో పూర్తిగా ఆందోళన నెలకొందని సర్పంచి వెంకటనాయుడు తెలిపారు. ఆధికారులు గ్రామానికి చేరుకుని అప్రమత్తం చేస్తున్నారు.
Next Story




