JC Prabhakar: మున్సిపల్ కమిషనర్‌ తీరుపై జేసీ ప్రభాకర్ వినూత్న నిరసన

JC Prabhakar: తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి స్నానం

Dhatripriya
Published on: 25 April 2023 9:48 AM IST
JC Prabhakar Innovative Protest Against Municipal Commissioner Behavior
X

JC Prabhakar: మున్సిపల్ కమిషనర్‌ తీరుపై జేసీ ప్రభాకర్ వినూత్న నిరసన

JC Prabhakar: తాడిపత్రి మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధికి అధికార పార్టీ నాయకులు ఆటంకం కలిగిస్తున్నారని.. జేసీ ప్రభాకర్‌రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీంతో వారం రోజుల క్రితం తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా చేస్తే ట్రాక్టర్లు, టిప్పర్లను కాల్చివేస్తామని జేసీ ప్రభాకర్‌రెడ్డి స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో సోమవారం ఆందోళనలకు పిలుపునివ్వడంతో.. అనుమతి లేదంటూ పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాత్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి మున్సిపల్ కార్యాలయం సమీపంలో డివైడర్ల మధ్య రాత్రి నిద్ర చేశారు .అర్ధరాత్రి సమయంలో పోలీసులు ఆయనను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లారు. అయినా... ఆయన బయటకు వచ్చి మున్సిపల్ కార్యాలయం వద్ద రాత్రి బస చేసి స్నానాలు అక్కడే చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు కార్యాలయం వదిలి వెళ్ళేది లేదంటున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story