Ananthapur: రఘువీరా, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆత్మీయ కలయిక

Ananthapur: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు : జేసీ * రాయలసీమ అభివృద్ధి కోసమే కలిశా : జేసీ

Sandeep Eggoju
Updated on: 2 Aug 2021 2:01 PM IST
JC Prabhakar and Congress Leader Raghuveera Meet at Ananthapur
X

జేసీ ప్రభాకర్ రెడ్డి & రఘువీరారెడ్డి (ఫైల్ ఇమేజ్)

Ananthapur: అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో భేటి అయ్యారు. అయితే, తమ భేటి వెనుక రాజకీయమైన వ్యూహాలు ఏమీ లేవని, సీమ బిడ్డలు అందరూ ఏకతాటిపైకి వచ్చి జలాల కోసం పోరాడాల్సిన అవసరముందని ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అందుకోసమే పలువురు అధికారులతో పాటు సీనియర్‌ నేతలను కలిశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రాజకీయాల్లో శత్రువులు, స్నేహితులు ఉంటారు. కానీ, పోరాటాలకు అవేమీ అడ్డుకావని అన్నారు. ఇప్పటికే మైసూరారెడ్డితోపాటు రాయలసీమలో చాలా మంది సీనియర్ నాయకులను, రిటైర్డ్ అధికారులను కలిసినట్లు తెలిపారు జేసీ ప్రభాకర్ రెడ్డి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story