Pavan Kalyan: మత్స్యపురి ఉద్రిక్తతపై స్పందించిన జనసేనాని

Pavan Kalyan: జనసేన విజయం చూసి వైసీపీ ఓర్వలేకపోతుంది: పవన్ * అందుకే మత్స్యపురిలో వైసీపీ దాడులు చేస్తుంది: పవన్

Sandeep Eggoju
Published on: 26 Feb 2021 8:18 PM IST
Janasenani Responds on Matsyapuri tension
X

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఇమేజ్)

Pavan Kalyan: మత్స్యపురి ఉద్రిక్తతలపై జనసేనాని పవన్ స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం చూసి వైసీపీ ఓర్వలేకపోతోందన్న పవన్ అందుకే మత్స్యపురిలో దాడులు చేస్తుందన్నారు. ఇదే సమయంలో భీమవరం ఎమ్మెల్యేపై సంచలన కామెంట్స్ చేశారు జనసేనాని. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కుక్కలు అరుస్తాయన్న పవన్ పిచ్చి కుక్క కరిచింది కదా అని మనం కూడా కరవం కదా అంటూ పంచులు విసిరారు. వైసీపీ ఎమ్మెల్యే భాష చూసి జనసైనికులు ఆగ్రహావేశాలకు లోనుకావొద్దన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా దాడులను ఎదుర్కోవాలని జనసైనికులకు పవన్ పిలుపునిచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story