జనసేన రూట్ మ్యాప్.. వైసీపీపై ఎదురు దాడే లక్ష్యంగా జనసేన అడుగులు

JanaSena to go Aggressive on YSR Congress Party
x

జనసేన రూట్ మ్యాప్.. వైసీపీపై ఎదురు దాడే లక్ష్యంగా జనసేన అడుగులు 

Highlights

JanaSena: జనసేన, వైసీపీ మధ్య పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోందా..?

JanaSena: జనసేన, వైసీపీ మధ్య పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోందా..? వైసీపీపై ఎదురు దాడే లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తోందా...? రెండు రోజులపాటు పార్టీ ముఖ్యనేతలతో కీలక భేటీ నిర్వహించిన పవన్ కల్యాణ్ ఈ మేరకు దిశానిర్దేశం చేశారా...? అంటే సమాధానం అవును అనే వస్తోంది. విశాఖ పర్యటనలో తనకు ఎదురైన ఇబ్బందులను జనసేన ముఖ్యనేతలకు వివరించారు. ఉద్దేశ్యపూర్వకంగా పార్టీ నేతలపై కేసులు పెట్టారని మండిపడ్డారు.

విశాఖలో పవన్‎పై దాడికి కుట్ర జరిగిందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు జనసేనాని డైరెక్షన్ ఇచ్చారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేలా పనిచేయాలని ఆ మేరకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని జనసేన ముఖ్యనేతలకు పవన్ మార్గనిర్దేశం చేయడం ఏపీ పాలిటిక్స్‎లో హాట్ టాపిక్‎గా మారుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories