Pawan Kalyan: జనసేనాని శ్రమదానం కార్యక్రమానికి షెడ్యూల్ ఖరారు

Pawan Kalyan: జనసేనాని శ్రమదానం కార్యక్రమానికి షెడ్యూల్ ఖరారైంది.

Arun Chilukuri
Updated on: 27 Sept 2021 6:16 PM IST
Janasena Shramadanam Program to Repair Roads
X

Pawan Kalyan: జనసేనాని శ్రమదానం కార్యక్రమానికి షెడ్యూల్ ఖరారు

Pawan Kalyan: జనసేనాని శ్రమదానం కార్యక్రమానికి షెడ్యూల్ ఖరారైంది. ఏపీలో రోడ్లపరిస్థితిపై ఇప్పటికే నాలుగు వారాల గడువు ఇచ్చిన జనసేన.. ప్రభుత్వం స్పందించకుంటే అక్టోబర్ 2న ఆందోళనలు నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో సోషల్ మీడియా వేదికగా ఉద్యమం చేపట్టనున్నారు.

అక్టోబర్ 2న ఉదయం 10గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర జనసేనాని పవన్ రోడ్లకు మరమ్మత్తులు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు అనంతపురం జిల్లా కొత్తచెరువు దగ్గర శ్రమదానం పేరుతో రోడ్లకు మరమ్మత్తులు చేయనున్నారు. జనసేనాని పిలుపుతో ప్రతీ నియోజకవర్గంలో రోడ్లకు మరమ్మత్తులు చేసేందుకు జనసైనికులు సిద్ధమవుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story