నేనొస్తున్నా.. ఈ నెల 8న కర్నూలు జిల్లాలో జనసేన రైతు భరోసా యాత్ర..

Rythu Bharosa Yatra: ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించేందుకు..

Arun Chilukuri
Updated on: 2 May 2022 8:45 PM IST
JanaSena Rythu Bharosa Yatra in Kurnool on May 8
X

నేనొస్తున్నా.. ఈ నెల 8న కర్నూలు జిల్లాలో జనసేన రైతు భరోసా యాత్ర..

Rythu Bharosa Yatra: ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించేందుకు జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహిస్తోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటివరకు అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు సాయం అందించారు. ఇందులో భాగంగా ఈ నెల 8న కర్నూలు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు.

ఈ నెల 8న ఉదయం 9.30 గంటలకు పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా చేరుకుంటారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. శిరివెళ్ల మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమంలో కూడా పవన్ పాల్గొంటారని ఆయన చెప్పారు. కాగా, తొలివిడతలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 130 కౌలు రైతు కుటుంబాలకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం అందించనున్నారు. మిగిలినవారికి రెండో విడతలో సాయం అందిస్తారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story