Pawan Kalyan: మా పోరాటం ఏపీ ప్రభుత్వంపైనే.. పోలీసులతో మాకు ఎటువంటి విభేదాలు లేవు

Pawan Kalyan: మా కార్యకర్తల బెయిల్ కోసం రేపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం

Rama Rao
Published on: 17 Oct 2022 5:28 PM IST
Janasena President Pawan Kalyan Reacted to the Visakhapatnam Incident
X

Pawan Kalyan: మా పోరాటం ఏపీ ప్రభుత్వంపైనే.. పోలీసులతో మాకు ఎటువంటి విభేదాలు లేవు

Pawan Kalyan: విశాఖ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ క‌ళ్యాణ్ స్పందించారు. పోలీసులతో తమకు ఎటువంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తమ పోరాటం ప్రభుత్వంపైనేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. నోవాటెల్ హోటల్ బయటనుంచి తనకు ఎంతో మంది విష్ చేసినా తాను అభివాదం చేయలేకపోయానని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆంక్షలే అందుకు కారణమన్నారు. 115 మందికిపైగా జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. తమ లీగల్ టీమ్ 60, 70 మందికి స్టేషన్ బెయిల్ ఇప్పించిందని వెల్లడించారు. మరో 10, 12 మంది కార్యకర్తలు రిమాండ్ లో ఉన్నారన్నారు. వారి బెయిల్ కోసం రేపు హైకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. తమ పార్టీ కార్యకర్తలకు బెయిల్ వచ్చేలా న్యాయపోరాటం చేస్తామని పవన్ చెప్పుకొచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story