Chandrababu: 12 గంటలకు చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్, బాలకృష్ణ, ములాఖత్‌

Chandrababu: రాజమండ్రికి చేరుకున్న పవన్, బాలకృష్ణ

Shekhar G
Published on: 14 Sept 2023 10:54 AM IST
Janasena President Pawan Kalyan Mulakhat With Chandrababu Naidu In Rajahmundry Central Jail At 12 Pm
X

Chandrababu: 12 గంటలకు చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్, బాలకృష్ణ, ములాఖత్‌

Chandrababu: స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బాలకృష్ణ పరామర్శించనున్నారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో లోకేష్‌ క్యాంప్‌నకు వెళ్లనున్నారు. అక్కడ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణిలను పవన్ పరామర్శిస్తారు. ఇప్పటికే బాలకృష్ణ... లోకేష్‌ క్యాంప్‌నకు చేరుకున్నారు.

చంద్రబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం... అక్కడి నుంచి నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు పవన్, బాలకృష్ణ చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు బాలకృష్ణతో కలిసి చంద్రబాబును కలవనున్నారు పవన్. దాదాపు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో మాట్లాడనున్నారు. అనంతరం.. పవన్, బాలకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ములాఖత్ తర్వాత పవన్ ఏం మాట్లాడుతారనే దానిపై అటు టీడీపీ, ఇటు జనసేన కేడర్ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story