Pawan Kalyan: రేపు విజయవాడలో జనసేనాని పర్యటన

Pawan Kalyan: వరుసగా 5 వారాల పాటు జనసేన-జనవాణి కార్యక్రమం

Rama Rao
Updated on: 9 July 2022 7:31 PM IST
Janasena Pawan Kalyan Visit to Vijayawada Tomorrow
X

Pawan Kalyan: రేపు విజయవాడలో జనసేనాని పర్యటన

Pawan Kalyan: రేపు విజయవాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగే రెండో విడత జనవాణి - జనసేన భరోసా కార్యక్రమంలో పవన్‌ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల నుంచి వారి సమస్యలపై విజ్ఞప్తులను స్వీకరించనున్నారు. వరుసగా 5 వారాల పాటు జనసేన - జనవాణి కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించనున్నారు జనసేనాని. గత ఆదివారం చేపట్టిన తొలి విడత జనవాణిలో 427 ఆర్జీలు వచ్చినట్టు పార్టీ నేతలు తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story