Pawan Kalyan: రెండురోజు కాకినాడలో జనసేనాని పవన్ పర్యటన

Pawan Kalyan: నగరంలోని డివిజన్ల వారీగా కార్యకర్తలతో భేటీ

Jyothi
Published on: 29 Dec 2023 11:37 AM IST
Janasena Pawan Kalyan Second-Day Visit to Kakinada
X

Pawan Kalyan: రెండురోజు కాకినాడలో జనసేనాని పవన్ పర్యటన

Pawan Kalyan: కాకినాడలో జనసేనాని పవన్ పర్యటిస్తున్నారు. కాకినాడ నగరంలో డివిజన్ల వారీగా జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం అవుతున్నారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ను ఓడించాలని పవన్ అడుగులు వేస్తున్నారు. కాకినాడ నగరంపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. డివిజన్లు వారీగా సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుంటున్నారు. గతంలో సర్పవరం బహిరంగ సభలో ద్వారంపూడిని ఓడిస్తానని పవన్ చెప్పారు. పవన్ ని ఓడించేందుకు ఎంత దూరమైనా వెళ్తానని ద్వారంపూడి సవాల్ విసిరారు.

ద్వారంపూడి టార్గెట్ గా కాకినాడ లో క్షేత్రస్థాయిలో పవన్ దృష్టి పెట్టారు. ఇవాళ సుమారు 15 డివిజన్లతో పూర్తిస్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నిన్న 15 డివిజన్లో సంబంధించిన జనసేన కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్నారు. ఒక డివిజన్ లో వివిధ వర్గాలకు సంబంధించిన సుమారు 20 మందితో స్వయంగా పవన్ మాట్లాడుతున్నారు. వార్డులో పరిస్థితులు ఎలా ఉన్నాయి , సమస్యలు ఏమిటి , ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది , మీ సమస్యలను ఏ విధంగా అధిగమించాలనే అంశాలు పవన్ అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా జనసేన ఇన్‌చార్జ్‌లతో పవన్ సమావేశం కానున్నారు.

Jyothi

Jyothi

Next Story