Pawan Kalyan: ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన జనసేనాని

Pawan Kalyan: ఈ నెల 27 నుంచి 20రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన

Jyothi
Published on: 23 March 2024 12:14 PM IST
Janasena Pawan Kalyan Ready for Election Campaign
X

Pawan Kalyan: ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన జనసేనాని

Pawan Kalyan: జనసేనాని ఎన్నికల ప్రచారానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి సుమారు 20 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. తొలి మూడు రోజులూ తను పోటీ చేసే పిఠాపురం నియోజక వర్గంలోనే ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రచారంతో పాటు.. అక్కడ స్థానిక కూటమి నేతలతో సమాలోచనలు, మీటింగులు నిర్వహించనున్నారు. మూడు పార్టీల నేతలో విస్తృతంగా చర్చించి.. గెలుపుపై స్థానిక నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు.

మరోవైపు పిఠాపురంపై వైసీపీ పూర్తిస్థాయిలో ఫోకస్ పెంచడంపై కూడా దృష్టిలో పెట్టుకోవాలని పవన్ సూచించనున్నారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జనసేన నేతలతో పార్టీ అధిష్టానం మాట్లాడింది. జనసేన పోటీ చేయని స్థానాల్లో మిత్ర పక్షాలను గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Jyothi

Jyothi

Next Story