జనసేన ఎమ్మెల్యే రాపాక ఊహించని ట్విస్ట్

X
Highlights
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తాను కాకుండా తన కుమారుడికి వైసీపీ కండువా...
Arun Chilukuri5 Dec 2020 1:45 AM GMT
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తాను కాకుండా తన కుమారుడికి వైసీపీ కండువా కప్పించారు. రాపాక వరప్రసాద్ కుమారుడు రాపాక వెంకట్ రామ్ వైసీపీలో చేరారు. వెంకట్ రామ్‌కి సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇక గత కొంత కాలం నుంచి రాపాక వరప్రసాద్ జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. గురువారం అసెంబ్లీలో తాను బతికున్నంత వరకు జగన్మోహన్ రెడ్డే సీఎంగా ఉంటారని రాపాక చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ తరుణంలోనే కుమారుడిని వైసీపీలో చేర్పించి మరోసారి చర్చనీయాంశమయ్యారు. సాంకేతి కారణాల వల్ల ఎమ్మెల్యేగా ఉండి, తాను వైసీపీలో చేరకుండా వ్యూహాత్మకంగా కుమారుడిని జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పించారు.
Web Titlejanasena mla rapaka varaprasad son joins in ysr congress party
Next Story