జగన్‌ లాంటి నాయకుడు ఉండటం మన అదృష్టం: రాపాక

జగన్‌ లాంటి నాయకుడు ఉండటం మన అదృష్టం: రాపాక
x
Highlights

తానూ బతికున్నంత కాలం జగనే ఏపీ సీఎం గా ఉంటారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. చిన్న వయసులోనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం దక్కించుకున్నారని ప్రశంసించారు.

తానూ బతికున్నంత కాలం జగనే ఏపీ సీఎం గా ఉంటారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. చిన్న వయసులోనే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం దక్కించుకున్నారని ప్రశంసించారు. ప్రజల శ్రేయస్సు కోసం ఇంతగా తపించే సీఎంను తానూ ఎప్పుడు కూడా చూడలేదని అన్నారు. సీఎం జగన్ లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని కొనియాడారు. సచివాలయం ద్వారా ప్రతి గ్రామంలోనూ 30 నుంచి 40 మంది వాలంటీర్లను నియమించడం గర్వించదగ్గ విషయమని అన్నారు.

జగన్ నాయకుడిగా ఉన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉండడం తానూ అదృష్టంగా భావిస్తున్నట్టుగా రాపాక వెల్లడించారు. దివంగత నాయకుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన స్వర్ణ యుగంలా ఉండేదని, వైఎస్‌ జగన్‌ అదే దారిలో నడుస్తున్నారని వర్ణించారు. ఇలాంటి నాయకుడు పదికాలాల పాటు సీఎంగా కొనసాగాలని అన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు చర్చలో భాగంగా గురువారం ప్రభుత్వ పథకాలపై ప్రసంగించిన రాపాక ఈ వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories