పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు.. పోసానిపై జనసేన ఫిర్యాదు..

Posani Krishna Murali: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సినీ నటులు పోసాని కృష్ణ మురళిపై జనసేన నాయకులు జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ కు ఫిర్యాదు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 12 Nov 2024 12:34 PM IST
Janasena Leaders Complains Against Posani Krishna Murali
X

పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు.. పోసానిపై జనసేన ఫిర్యాదు..

Posani Krishna Murali: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సినీ నటులు పోసాని కృష్ణ మురళిపై జనసేన నాయకులు జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ కు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో జనసేన నాయకులు గుర్తు చేశారు. ఈ విషయమై అప్పట్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. గతంలో పోసాని పై ఫిర్యాదుల అంశాన్ని జనసేన నాయకులు తెరమీదికి తెచ్చారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చంద్రబాబు ఇంటిపై దాడి కేసు, టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు, గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులతో పాటు గతంలో ప్రధాన ఘటనలకు సంబంధించి అప్పట్లో టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయా పోలీస్ స్టేషన్లలో తాజాగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఇంటిపై దాడి కేసు సహా ఇతర కేసుల్లో విచారణల్లో మళ్లీ కదలిక వచ్చిందని తెలుగు తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు. అయితే తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకొని తప్పుడు కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఆరోపణలు చేస్తోంది.

మరో వైపు గత ఐదేళ్లలో తప్పులు జరిగాయి. వాటిని సరిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ డిజీపీ ద్వారకా తిరుమలరావు ఇటీవల అనంతపురంలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story