Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా ఎగురవేస్తా

Pawan Kalyan: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిలుపుదలపై ప్రధానితోమాట్లాడా

Shekhar G
Published on: 14 Aug 2023 7:19 AM IST
Janasena Flag Will Be Hoisted In Gajuwaka In The Next Elections Says Pawan Kalyan
X

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా ఎగురవేస్తా

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా ఎగువేస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ ధీమా వ్యక్తంచేశారు. వారాహి యాత్రలో ఆయన విశాఖజిల్లా గాజువాకలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తనకు సినీ నటనలో ఓనమాలు, జీవితంలో పోరాట పటిమను నేర్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

విశాఖలో ఎంతో మంది బలిదానాలతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకునే దమ్మూధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు లేదన్నారు. నేర చరితులను నాయకులుగా ఎన్నుకుంటే ప్రజలకు ఏమీచేయలేరనే విషయాన్ని ప్రజలు ఆలస్యంగా గుర్తించారని పవన్ పర్కొన్నారు. విశాఖ ఎంపీ నేరచరితుడని, రౌడీషీటర్ ప్రధాని ముందు నిలబడే మాట్లేడే ధైర్యం ఉండదన్నారు. రకరకాల కేసులు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్, వి‎శాఖ స్టీలుప్లాంట్ ‌ప్రైవేటీకరణను నిలుపుదల చేయమని అడిగే ధైర్యం లేదన్నారు.

Shekhar G

Shekhar G

Next Story