ఇంజినీరింగ్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: పవన్ కల్యాణ్

ఇంజినీరింగ్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: పవన్ కల్యాణ్
x
Highlights

Engineering Exams : రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులకు సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణపై విద్యార్ధులు, వారి తల్లితండ్రుల్లో నెలకొన్న ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి పరిగణనలోకి తీసుకోవాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు.

Engineering Exams : రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులకు సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణపై విద్యార్ధులు, వారి తల్లితండ్రుల్లో నెలకొన్న ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి పరిగణనలోకి తీసుకోవాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు.. ఈ మేరకు అయన ఓ ప్రకటనను విడుదల చేశారు. కరోనా మూలంగా మార్చి నెల నుంచి విద్యాసంస్థలు మూతపడ్డ క్రమంలో తమకు సెమిస్టర్‌ పరీక్షల సమాచారం కూడా సక్రమంగా ఇవ్వకుండా పరీక్షల పెడ్యూల్‌ ప్రకటించి ఏర్పాట్లు చేయడంపై విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని పవన్ అన్నారు..

ఇక ఇప్పటికీ రాష్ట్రంలో వేల కొద్దీ కరోనా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయని, ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో పరీక్షలకు వెళ్లాలంటే భయంగా ఉందని విద్యార్థులు, వారి తల్లితండ్రులు జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారని పవన్ వెల్లడించారు. ప్రతి సెమిస్టర్‌ లో ఎనిమిది పరీక్షలు ఉంటాయనీ, ప్రస్తుతం స్వస్థలాల్లో ఉన్న విద్యార్థులను మళ్ళీ కాలేజీలు ఉన్న ప్రాంతానికి ఎలా పంపించాలని కన్నవారు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. అలాగే సెమిస్టర్‌ పరీక్షలకు విద్యార్థులు ఏ మేరకు సన్నద్ధమై ఉన్నారో కూడా బె.ఎన్‌.టియూ. వర్గాలు కూడా సరిగ్గా అంచనాకు రాలేదు. వారి ఆవేదనను సంబంధితవిశ్వవిద్యాలయాలకు చెబుతున్నా స్పందించకుండా పరీక్షల నిర్వహణకే ముందుకు వెళ్ళడం భావ్యం కాదని అన్నారు పవన్..

మానసిక ఒత్తిడిలో ఉన్న విద్యార్ధుల గురించి ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి సానుకూలంగా ఆలోచించాలని, ఇతర రాష్ట్రాల విద్యాశాఖలు, ఎన్‌.ఐ.టీలు సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణలో అనుసరించిన విధానాలను, యూజీసీ మార్గ దర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి. సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణను నిలుపుదల చేసి విద్యార్థులపై మానసిక ఒత్తిడిని తగ్గించాలని పవన్ పేర్కొన్నారు.
Show Full Article
Print Article
Next Story
More Stories