Pawan Kalyan: గుంతలు పూడ్చరు.. రోడ్లు వేయరు.. కానీ రోడ్డు విస్తరణ కావాలా..?

*ఇళ్లు కోల్పోయిన బాధితులకు పవన్‌ పరామర్శ

Rama Rao
Updated on: 5 Nov 2022 11:34 AM IST
Janasena Chief Pawan Kalyan Visits Ippatam Village in Guntur
X

గుంటూరు జిల్లా ఇప్పటంలో టెన్షన్.. టెన్షన్

Pawan Kalyan: గుంటూరు జిల్లా ఇప్పటంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేశారు అధికారులు. అయితే.. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇవ్వడం వల్లే తమ ఇళ్లను కూల్చేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన జనసేనాని.. ఇప్పటంలో పర్యటించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా.. ఇళ్లను కూల్చివేసిన తీరును బాధితులు పవన్‌కు వివరించారు. దీంతో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పవన్‌ కల్యాణ్. రోడ్డు విస్తరణ చేయడానికి ఇప్పటం ఏమైనా రాజమండ్రా..? కాకినాడా అంటూ ఫైర్‌ అయ్యారు. వైసీపీ తీరు మారకపోతే.. ఇడుపులపాయలో హైవే వేస్తామని అన్నారు పవన్. గుంతలు పూడ్చలేరు.. రోడ్లు వేయలేరు కానీ.. రోడ్డు విస్తరణలు కావాలా అంటూ దుయ్యబట్టారు.

Rama Rao

Rama Rao

Next Story