ఏపీలో పార్టీ బలోపేతంపై పవన్ దృష్టి.. మంగళగిరి నేతలతో వరుస సమావేశాలు

ఏపీలో పార్టీ బలోపేతంపై పవన్ దృష్టి.. మంగళగిరి నేతలతో వరుస సమావేశాలు
x
Highlights

రాష్ట్రంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై దృష్టి సారించారు పవన్. మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల కార్యకర్తలతో పవన్ భేటీ అయ్యారు.

ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతున్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. వకీల్‌సాబ్‌ షూటింగ్‌లో పాల్గొంటూనే సమయం దొరికినపుడల్లా.. తన పార్టీ సీనియర్‌ నేతలను పొలిటికల్‌ అప్‌డేట్స్‌ అడిగి తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై దృష్టి సారించారు పవన్. మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల కార్యకర్తలతో పవన్ భేటీ అయి.. ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితుల గురించి ఆరా తీశారు.

అనంతరం తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో జనసేనాని భేటీ అయ్యారు. ఆపదలో ఉన్న ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే.. పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు పవన్. మరోవైపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్నట్టు పవన్‌ ప్రకటించడంతో తెలంగాణలోని జనసేన కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పొత్తుతో ముందుకు వెళ్తారా.. లేదా సింగిల్‌గా పోటీ చేస్తారా అనేదానిపై పవన్‌ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories