Pawan Kalyan: ప్రజాస్వామ్యం బతకాలంటే ముందుగా పార్టీలు బతకాలి

Pawan Kalyan: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరినీ కలుపుకొని పోతాం

Rama Rao
Published on: 18 Oct 2022 6:39 PM IST
Janasena Chief Pawan Kalyan Comments on CM Jagan | AP News
X

Pawan Kalyan: ప్రజాస్వామ్యం బతకాలంటే ముందుగా పార్టీలు బతకాలి

Pawan Kalyan: ప్రజాస్వామ్యం బతకాలంటే ముందుగా పార్టీలు బతకాలన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. పార్టీల గొంతే నొక్కేస్తే ప్రజాస్వామ్యానికి మనుగడ ఎక్కడిది అని ప్రశ్నించారు. ఢిల్లీలో బీజేపీ నేతలకు లడ్డూలు ఇచ్చి.. ఇక్కడ తమ మిత్రపక్షమైన బీజేపీ నేతల మీద కేసులు పెడుతున్నారంటూ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఏం చేయాలో మిగతా పార్టీలతో, ప్రజాసంఘాలతో కలిసి చర్చిస్తామన్నారు. ఈ విషయంలో అందరినీ కలుపుకొని వెళ్తామన్నారు పవన్. ఎన్నికల ఎజెండా తమ కలయికలో లేదన్నారు. విజయవాడ నోవాటెల్ లో చంద్రబాబునాయుడుతో భేటీ తరువాత మీడియా జాయింట్ కాన్ఫరెన్స్ లో పవన్ మాట్లాడారు.

Rama Rao

Rama Rao

Next Story