Janasena: విశాఖ జిల్లా జనసేన సమన్వయకర్తల జాబితా విడుదల

Janasena: అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులు, రాజకీయ సమీకరణాలపై ఆరా

Shekhar G
Published on: 19 Feb 2024 5:39 PM IST
Janasena Chief Pawan Kalyan Announced Coordinators For 4 Constituencies In Visakhapatnam
X

Janasena: విశాఖ జిల్లా జనసేన సమన్వయకర్తల జాబితా విడుదల

Janasena: సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో ఏపీలో ఆయా పార్టీలు నియోజకవర్గాల ఇంఛార్జీలు, సమన్వయ కర్తలను నియమించుకుంటుకుంటున్నాయి. తాజాగా విశాఖ జిల్లాకు సంబంధించి సమన్వయ కర్తల జాబితాను జనసేన పార్టీ విడుదల చేసింది. భీమిలి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్‌, గాజువాక - సుందరపు సతీష్‌, పెందుర్తి - పంచకర్ల రమేష్‌, ఎలమంచిలి నుంచి సుందరపు విజయ్‌కుమార్‌లు జనసేన సమన్వయ కర్తలుగా నియమించారు.

టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించే వరకూ..ఆయా నియోజకవర్గాలకు సమన్వయ కర్తలుగా పనిచేస్తారని ఆ పార్టీ స్పష్టం చేసింది. విశాఖ సౌత్, పాయకరావు పేటలో కూడా తమకు విజయ అవకాశాలు ఉన్నాయని జనసేన భావిస్తోంది. పాయకరావుపేట నుంచి మాజీ ఎమ్మెల్సీ శివకుమారి, విశాఖ సౌత్ నుంచి కార్పొరేటర్ సాధిక్‌ను పిలిచి విజయావకాశాలపై పవన్ కల్యాణ్ మాట్లాడారు. అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులు, రాజకీయ సమీకరణాలపై ఆరా తీశారు జనసేనాని.

Shekhar G

Shekhar G

Next Story