Pawan Kalyan Tweet on Amaravati Farmers: రైతుల త్యాగాలను వృథా కానీయం : పవన్ కళ్యాణ్

Pawan Kalyan Tweet on Amaravati Farmers: రైతుల త్యాగాలను వృథా కానీయం : పవన్ కళ్యాణ్
x
Highlights

Pawan Kalyan Tweet on Amaravati Farmers: అమరావతి రాజధానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు.

Pawan Kalyan Tweet on Amaravati Farmers: అమరావతి రాజధానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని నిర్ణయించారని, అందుకే రైతులు తమ 34 వేల ఎకరాల పంట భూములను త్యాగం చేశారని ఆయన జనసేన పార్టీ తరపున విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనలో పవన్ తమ పాలన వచ్చింది కాబట్టి రాజధాని మార్చుకొంటామని ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఆ రైతాంగాన్ని అనమానించడమేనని జనసేన తొలి నుంచి చెబుతోందినని అన్నారు.

రాజధానిని పరిరక్షించునేందుకు 200 రోజులుగా రైతులు, రైతు కూలీలు, మహిళలు అలుపెరగని పోరాటం చేస్తున్నారని అన్నారు. రాజధానిగా అమరావతి ఉండాలని సాగుతున్న ఆ పోరాటానికి మా పార్టీ సంఘీభావం ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీతో కలసి వారికి అండగా నిలబడతామని, ఎట్టి పరిసితుల్లోనూ 29వేల మంది రైతుల త్యాగాలను వృథా కానీయమని పవన్ అన్నారు.

ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తదుపరి వచ్చే పాలకులు అమలు చేస్తూ మరింత పురోగతికి ప్రణాళికలు సిద్ధం చెయాలి అంతే తప్ప గత ప్రభుత్వం వేరు మా ప్రభుత్వం నేరు అనడం ప్రజాస్వామ్య విధానం కాదని అన్నారు. రైతులు తము భూములను ఇచ్చింది ప్రభుత్వానికి తప్ప... ఒక వ్యక్తికో, పార్టీకో కాదు. కాబట్టి ఆ రోజు భూములు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలని అన్నారు పవన్..

ఇక రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు విషయంలో కూడా ప్రభుత్వం అలక్ష్యం ప్రదర్శించడం ఎంత మాత్రం భావ్యం కాదని, గత యేడాది కూడా రైతులు నిరసనలు చేపడితే తప్ప కొలు చెల్లింపులకు నిధులు విడుదల చేయలేదని, ఈ దఫా కూదా అదే పరిస్టితి ఉందని అన్నారు. కాలు చెల్లింపులకు జీవో ఇచ్చారు తప్ప రైతులకు ఇప్పటి వరకూ ఆ మొత్తాలు చేరలేదని పవన్ పేర్కొన్నారు.

ఏప్రిల్‌ మాసంలో అందాల్సిన కొలు ఇప్పటి వరకూ ఇవ్వకపోవడం రైతులను వేదనకు గురి చేయడము. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి. అంతే తప్ప రాజధానిని మూడు ముక్కలు చేయడం ద్వారా అభివృద్ధి వికంద్రీకరణ అయినట్లు కాబోదని, ఏ జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేయాలి? ఏయే రంగాలను ఏ జిల్లాల్లో అభివృద్ధి చేస్తారు? అక్కడ ఏర్పాటు చేసే అభివృద్ది ప్రాజెక్టులు ఏమిటి అనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని పవన్ తన లేఖలో పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories