Bheemla Nayak: పేర్ని నాని, కొడాలి నాని కి పవన్ అభిమానుల సెగ...

Bheemla Nayak: ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలను కావాలనే అడ్డుకుంటోందని అభిమానులు ఆరోపిస్తున్నారు.

Arun Chilukuri
Published on: 25 Feb 2022 1:10 PM IST
Jana Sena Leaders Stops Ministers Perni Nani and Kodali Nani
X

Bheemla Nayak: పేర్ని నాని, కొడాలి నాని కి పవన్ అభిమానుల సెగ...

Bheemla Nayak: ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలను కావాలనే అడ్డుకుంటోందని అభిమానులు ఆరోపిస్తున్నారు. విజయవాడలో ఓ సినిమా థియేటర్ ప్రారంభించేందుకు వచ్చిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు అడ్డుకునేందుకు పవన్ అభిమానులు ప్రయత్నించారు. అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పవన్ కళ్యాణ్ సినిమాలపై ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని అభిమానులు ఆరోపిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో పవన్‌ సినిమాను కక్షపూరితంగా అడ్డుకోవడం దారుణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని నానికి వినతిపత్రం అందించేందుకు వచ్చిన తమను అరెస్ట్‌ చేయడమేంటని మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story