Home > ఆంధ్రప్రదేశ్ > ఇంగ్లీష్‌పై అంత ప్రేమ ఉంటే తిరుపతిలో సుప్రభాతం కూడా ఇంగ్లీష్‌లో చదివించండి : పవన్‌కల్యాణ్
ఇంగ్లీష్‌పై అంత ప్రేమ ఉంటే తిరుపతిలో సుప్రభాతం కూడా ఇంగ్లీష్‌లో చదివించండి : పవన్‌కల్యాణ్

X
Highlights
వైసీపీ ప్రభుత్వంపై జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. ఇసుక కొరతతో పని దొరక్క కార్మికులు ఆత్మహత్య...
Arun Chilukuri12 Nov 2019 11:20 AM GMT
వైసీపీ ప్రభుత్వంపై జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. ఇసుక కొరతతో పని దొరక్క కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన పవన్‌కల్యాణ్ ఏపీలో పెరిగిపోతోన్న భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలతో పాటు ఇసుక కొరత వంటి అంశాలపై పవన్ వినతిపత్రం ఇచ్చారు. ఇసుక రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలకమన్నారు. ఏపీలో నాలుగు నెలలుగా ఇసుక దొరకడం లేదన్న పవన్ ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలైందన్నారు.
ఏపీ చరిత్ర గురించి జగన్‌కు అవగాహన ఉందా? అని ప్రశ్నించారు పవన్‌కల్యాణ్. తెలుగు భాష తమకు సంస్కారం నేర్పిందన్నారు. ఆంగ్లమాధ్యమం వల్ల విద్యార్థుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందన్నారు. ఇంగ్లీష్‌పై అంత ప్రేమ ఉంటే తిరుమలలో సుప్రభాతం కూడా ఆంగ్లంలోనే చదివించండని వ్యాఖ్యానించారు.
Next Story