Tirupati: తిరుపతిలో నేడు జనసేన చీఫ్ టూర్

Tirupati: ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న పవన్‌ * తిరుపతిలో బహిరంగ సభల్లో ప్రసంగించనున్న పవన్‌

Sandeep Eggoju
Updated on: 3 April 2021 11:26 AM IST
Jana Sena Chief Pavan Kalyan Tour in Tirupati
X

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

Tirupati: తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉపఎన్నికపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గెలుపుకోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో గట్టిపోటీ ఇచ్చేందుకు జనసేన-బీజేపీ కూటమి కూడా పావులు కదుపుతోంది. ఇప్పటికే రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభతో పాటు ముఖ్యనేతలంతా తిరుపతిలో మకాం వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగబోతున్నారు. పవన్ కల్యాణ్ తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధి రత్నప్రభకి మద్దతుగా తిరుపతి నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

పవన్ రాకతో తిరుపతి పోరు మరింత రసవత్తరంగా మారనుంది. పవన్ పర్యటన అటు జనసైనికుల్లోనూ జోష్ నింపనుంది. జనసేనాని టూర్ తమకు కలిసొస్తుందని బీజేపీ కూడా భావిస్తోంది. ఏపీ రాజకీయాల్లో బీజేపీ-జనసేన పొత్తు మంచి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందనే విశ్వాసం ప్రజల్లో కల్పించే విధంగా పవన్ కల్యాణ్ పాదయాత్ర ఉంటుందని జనసేన నేతలు చెప్తున్నారు. పవన్‌కు ఘనస్వాగతం పలికేందుకు స్థానిక నాయకులతో పాటు రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story