Jagananna Cheyutha Scheme 2020: రేపే 'జగనన్న చేయూత' పథకం ప్రారంభం..

Jagananna Cheyutha Scheme 2020: రేపే జగనన్న చేయూత పథకం ప్రారంభం..
x
YS Jagan (File Photo)
Highlights

Jagananna Cheyutha Scheme 2020: అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు ఏపీ సీఎం జగన్

Jagananna Cheyutha Scheme 2020: అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. కరోనా సమయంలో కూడా వైద్యం కోసం 104, 108 వాహనలను ప్రారంభించిన జగన్ మరో పథకానికి శ్రీకారం చుట్టారు.. రేపు(ఆగస్ట్ 12) 'జగనన్న చేయూత' పథకం ప్రారంభించనున్నారు. ఈ విషయాన్నీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ వెల్లడించారు.

ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది మహిళలకు ఈ ఏడాది 4 7 00 కోట్లు కేటాయించినట్లుగా ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం కానున్నట్లుగా అయన వెల్లడించారు.ఇక పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సహాయం అందించనున్నారు.

మొత్తం నాలుగేళ్ళలో ఈ పథకం అమలుకు గాను రూ.18 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకూ ప్రభుత్వం ఖర్చు చేయనుందని అంచనా. ఈ పథకం కింద వెనుకబడిన తరగతి మహిళలకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆర్థిక ప్రోత్సాహం నేరుగా బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories