YSRCP: ఎన్నికల ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న జగన్
YSRCP: సిద్ధం సమావేశం తర్వాత నియోజకవర్గాల వారీగా జగన్ సమావేశాలు
YSRCP:ఎన్నికల ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న జగన్
YSRCP:విజయవాడ సీకే కన్వెన్షన్ సెంటర్‌లో వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల ప్రచారంపై నేతలకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బూత్ లెవల్‌లో నాయకులు పనిచేసేలా సూచనలు చేసే అవకాశం ఉంది. సమావేశానికి 2 వేల మంది ముఖ్యనేతలను వైసీపీ ఆహ్వానించింది. రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, మండల స్థాయి నేతలకు ఆహ్వానాలు అందగా.... ఇప్పటికే సమావేశ స్థలానికి వారంతా చేరుకున్నారు. సిద్ధం సమావేశం తర్వాత నియోజకవర్గాల వారీగా ఎన్నికల క్యాంపెయిన్ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు.
Next Story




