గుంటూరు మిర్చి రైతులకు జగన్ పరామర్శ: చంద్రబాబు సర్కార్ పై విమర్శలు

గుంటూరు మిర్చి రైతులకు జగన్ పరామర్శ: చంద్రబాబు సర్కార్ పై విమర్శలు
x
Highlights

YS Jagan: వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డులో రైతులను బుధవారం పరామర్శించారు. మిర్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

YS Jagan: వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డులో రైతులను బుధవారం పరామర్శించారు. మిర్చి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున మిర్చి యార్డులో ఎలాంటి రాజకీయ సభలు, సమావేశాలకు అనుమతి లేదని అధికారులు ప్రకటించారు. అయితే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని అధికారులు ఫిబ్రవరి 18న ప్రకటించారు.కానీ, తాము ముందుగా ప్రకటించినట్టుగా గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వంలో ఆర్ బీ కేలతో రైతులకు న్యాయం జరిగిందని ఆయన చెప్పారు.

కానీ, చంద్రబాబు సర్కార్ ఈ ఆర్ బీ కేలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామన్నారు. రైతులకు కల్తీ లేని విత్తనాలు, ఎరువులు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని జగన్ విమర్శించారు.సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మిర్చి రైతుల కష్టాలు చంద్రబాబుకు కన్పించడం లేదని ఆయన విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆయన చెప్పారు. గిట్టుబాటు ధర లేని కారణంగా మిర్చిని విక్రయించుకోలేని పరిస్థితుల్లో రైతులున్నారని ఆయన అన్నారు.గుంటూరు మిర్చి యార్డుకు తాను రైతుల పరామర్శకు వస్తే తనకు పోలీస్ భద్రత కల్పించలేదని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే తాను ఇలానే చేస్తే ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

ఈ ఏడాది మిర్చి దిగుబడి తగ్గింది. గత సీజన్ లో మిర్చి ధర క్వింటాల్ కు ఇరవై నుంచి ముప్పై వేలు పలికింది.కానీ, ఈ సీజన్ లో క్వింటాల్ మిర్చి ధర పదిహేను వేలకు పడిపోయింది.ఈ ఏడాది 40 శాతం మిర్చి విక్రయాలు తగ్గాయి. గత ఏడాది 5.93 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగైంది. ఈ ఏడాది 3.53 లక్షల ఎకరాల్లో మాత్రమే రైతుల మిర్చి సాగు చేశారు. అధికారుల లెక్కల ప్రకారం 5.14 లక్షల టన్నుల్లో దిగుబడి వచ్చిందని అంచనా. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో మిర్చి ధరలు 50 శాతం తగ్గిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.తేజ మిర్చికి క్వింటాల్ కు జనవరి నెలతో పోలిస్తే రూ. 3 వేలు తగ్గింది. తేజ బెస్ట్ క్వాలిటీ మిర్చికి తక్కువలో తక్కువగా క్వింటాల్ కు 8 వేలు, గరిష్టంగా 18,500 చెల్లిస్తున్నారు. బాడిగ రకానికి కనిష్టంగా 9 వేలు, గరిష్టంగా 16,500 ధర పలుకుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories