జనసేన అధినేత పవన్ కల్యాణ్‎కు చెక్ పెట్టేందుకు వైసీపీ ప్లాన్

Andhra Pradesh News: జనసేన అధినేత పవన్‎పై వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాపు అస్త్రాన్ని సంధిస్తున్నారా..?

Arun Chilukuri
Updated on: 31 Oct 2022 9:30 PM IST
Jagan to Attack Jana Sena With Kapu Strategy
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్‎కు చెక్ పెట్టేందుకు వైసీపీ ప్లాన్

Andhra Pradesh News: జనసేన అధినేత పవన్‎పై వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాపు అస్త్రాన్ని సంధిస్తున్నారా..? పవన్ కల్యాణ్‎కు చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా...? కాపు అస్త్రాన్ని బయటకు తీస్తున్నారా..? సొంత సామాజికవర్గంలో పవన్‎కు పట్టులేకుండా చేయాలని వ్యూహం రచిస్తున్నారా..? అంటే సమాధానం అవును అనే వస్తోంది. అందుకు స్పష్టమైన సంకేతాలిస్తోంది వైసీపీ. కాపులకు వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని వివరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు రాజమండ్రి వేదికగా కాపు నేతలు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజికవర్గానిది కీలక పాత్ర. ఏపీలో కాపు సామాజికవర్గం దాదాపు ఇరవై శాతం ఓటు బ్యాంకు కలిగిఉంది. కాపు సామాజికవర్గం ఎటువైపు మొగ్గు చూపితే వాళ్లదే అధికారమనడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికల్లో కాపు సామాజికవర్గం వైసీపీకి జైకొట్టగా ఆ పార్టీ విజయభేరి మోగించింది.

2014లో చంద్రబాబుకు పవన్ మద్దతు తెలిపగా కాపు సామాజికవర్గం టీడీపీకి అండగా నిలిచింది. ఇటీవల చంద్రబాబు, పవన్ భేటీ కావడంతో మళ్లీ ఈ కాంబినేషన్ గ్యారెంటీ అనే ప్రచారం జరుగుతోంది. వైసీపీలోని కాపు నేతలను టార్గెట్ చేస్తూ పవన్ కామెంట్స్ చేయడం ఏపీ రాజకీయల్లో హీట్ పుట్టించాయి. మరోసారి పవన్, చంద్రబాబు కాంబినేషన్‎‎లో ఎన్నికలకు వస్తే కాపు సామాజికవర్గం ఎటువైపు మొగ్గుచూపుతుందోనని వైసీపీలో టెన్షన్ మొదలైందని పొలిటికల్ సర్కిల్స్‎లో ప్రచారం జరుగుతోంది. ముందే అప్రమత్తమైన వైసీపీ తమ విజయావకాశాలు దెబ్బతినకుండా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. కాపు సామాజికవర్గం పవన్ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా రాజమండ్రిలో కీలక సమావేశం నిర్వహించి వ్యూహాలు రచిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story