SEC ఈ-వాచ్‌ యాప్‌పై జగన్ సర్కార్ అభ్యంతరం.. హైకోర్టులో పిటిషన్

*హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన ప్రభుత్వం *లంచ్ మోషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

Samba Siva Rao
Published on: 3 Feb 2021 3:18 PM IST
Jagan Sarkar objects to SEC e watch app
X

Jagan Sarkar objects to SEC e watch app

ఏపీ ఎన్నికలసంఘం విడుదల చేసే ఈ-వాచ్ యాప్‌పై ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై విచారణనను రేపు జరుపుతామని హైకోర్టు తెలిపింది. ఈ వాచ్ యాప్ పూర్తిగా ప్రైవేట్ యాప్ అని ప్రభుత్వం చెబుతోంది. ఈసీకి చెందిన సి-విజిల్ యాప్ లేదా ప్రభుత్వ యాప్‌ను ఉపయోగించాలని ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరుతోంది. ఈ యాప్ టీడీపీ కనుసన్నల్లో తయారైందని వైసీపీ ఆరోపిస్తుంది. ఎన్నికల సంఘం ప్రైవేట్‌గా ఎందుకు ఈ యాప్‌ను తీసుకు వస్తున్నారని ప్రశ్నిస్తుంది. యాప్‌ను నిలిపి వేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story