నేటితో ముగియనున్న జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర

Jagan: నేడు 22వ రోజు సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర

Jyothi
Published on: 24 April 2024 8:41 AM IST
Jagan Memantha Siddham Bus Yatra Will End Today
X

నేటితో ముగియనున్న జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర

Jagan: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగియనుంది. ప్రస్తుతం ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. కాసేపట్లో అక్కివలస నైట్ క్యాంప్ నుంచి సీఎం జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఎచ్చెర్ల, కుశాలపురం, శ్రీకాకుళం బైపాస్‌, పలివలస, నరసన్నపేట క్రాస్‌, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పరశురాంపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పరశురాంపురం జంక్షన్‌ వద్ద భోజన విరామం తీసుకుంటారు.

అనంతరం సాయంత్రం 4 గంటలకు పరశురాంపురం నుంచి సీఎం జగన్‌ బయలుదేరి టెక్కలికి చేరుకుంటున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. టెక్కలి సభతో సీఎం జగన్ 22 రోజులు చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర ముగియనుంది. అనంతరం మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా సీఎం జగన్ చివరి విడత ప్రచారం కొనసాగేలా వైసీపీ నేతలు ప్లాన్ చేశారు.

Jyothi

Jyothi

Next Story