నేడు పల్నాడు జిల్లాలో జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర

Jagan: ఉ.9 గంటలకు గంటావారిపాలెం నుంచి ప్రారంభం

Jyothi
Published on: 10 April 2024 8:09 AM IST
Jagan Memantha Siddham Bus Yatra in Palnadu District Today
X

నేడు పల్నాడు జిల్లాలో జగన్‌ మేమంతా సిద్ధం యాత్ర

Jagan: ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 12వ రోజుకు చేరుకుంది. ఇవాళ పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర కొనసాగనుంది. ఉదయం తొమ్మిది గంటలకు గంటావారిపాలెం నుంచి ఈ ప్రారంభంకానుంది. పుట్టవారిపాలెం, సంతమాగులూరు, రొంపిచర్ల క్రాస్ రోడ్, విప్పెర్ల మీదుగా దేవరంపాడు వరకు జగన్ బస్సుయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు అయ్యప్పనగర్ బైపాస్‌లో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు.

Jyothi

Jyothi

Next Story