Y S Jagan: కడప రిమ్స్‌లో వైసీపీ నాయకుడిని పరామర్శించిన జగన్

Y S Jagan: చెడు సంప్రదాయాలకు చంద్రబాబు బీజం వేస్తున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 6 July 2024 9:15 PM IST
Jagan meets the YCP leader in Kadapa RIMS Hospital
X

Y S Jagan: కడప రిమ్స్‌లో వైసీపీ నాయకుడిని పరామర్శించిన జగన్

Y S Jagan: చెడు సంప్రదాయాలకు చంద్రబాబు బీజం వేస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. వెంపల్లిలో టీడీపీ వర్గాల చేతిలో గాయపడిన వైసీపీ నాయకుడిని కడప రిమ్స్ ఆస్పత్రిలో జగన్ పరామర్శించారు. వైసీపీకి ఓటు వేశారన్న కారణంతో దాడి చేయడం సరైంది కాదన్నారు జగన్. పులివెందులలో ఎన్నడూ ఇలాంటి సాంప్రదాయం లేదన్నారు. చంద్రబాబు ఏం సాధించాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. నాయకులలా ఉండి ఇలాంటివి ప్రోత్సహించకూడదని హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు మాజీ సీఎం జగన్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story