Jagan: పార్లమెంటు సమావేశాల నేపధ్యంలో ఎంపీలతో జగన్ భేటీ

* సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ * ఏ కూటమిలోనూ లేం..ఎవరికీ కొమ్ముకాయటం లేదు

Shilpa
Published on: 26 Nov 2021 7:53 PM IST
Jagan Meeting with MPs in the Wake of  Winter Sessions of Parliament to be Held from the 29 11 2021
X

పార్లమెంటు సమావేశాల నేపధ్యంలో ఎంపీలతో జగన్ భేటీ(ఫైల్ ఫోటో)

Jagan: ఈనెల 29 నుంచి జరగనున్నపార్లమెంటు శీతాకాల సమావేశాలలలో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ ఎంపీలకు జగన్ దిశా నిర్దేశం చేశారు. వైసీపీ ఏ కూటమి లోనూ లేదని, ఏ పార్టీకీ కొమ్ముకాయదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో గట్టిగా పోరాడాలని ఎంపీలకు జగన్ సూచించినట్లు సమాచారం.

ఏపీకి రావాల్సిన నిధులన్నీ ఇస్తే రాష్ట్రం అభివృద్ధి ఖాయమని నిధుల విషయమై కేంద్రాన్ని నిలదీయాలని సూచించినట్లు తెలుస్తోంది. విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపైనా, ప్రత్యేక హోదాపైనా, పోలవరం నిధులపైనా, సమయం వచ్చిన ప్రతీసారీ కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని జగన్ ఎంపీలకు దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం.

Shilpa

Shilpa

Next Story