జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

Jagan Govt: కాపు రిజర్వేషన్ ఉద్యమంలో నమోదు అయిన కేసులను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 3 Feb 2022 3:31 PM IST
Jagan Govt Lifts all Cases Related Kapu Stir
X

జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

Jagan Govt: కాపు రిజర్వేషన్ ఉద్యమంలో నమోదు అయిన కేసులను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 2016-2019 మధ్య కాపు రిజర్వేషన్ ఉద్యమంలో నమోదు అయిన 176 పెండింగ్ కేసులను ఉపసంహరించుకుంటూ హోమ్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లా, కిర్లంపూడి, ధవళేశ్వరం, అంబాజీపేట, తుని, గొల్లప్రోలు, పిఠాపురం, గుంటూరు అర్బన్ తదితర పోలీసు స్టేషన్లలో ఏపీ పోలీస్ చట్టం, రైల్వే చట్టం కింద 329 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 153 కేసులు డిస్పోస్ అయినట్ట ప్రభుత్వం తెలిపింది. మిగతా పెండింగ్ కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోమ్ శాఖ స్పష్టం చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story